విజయదశమి నాడు మనం షిరిడి సాయిబాబాను ఎందుకు స్మరించాలంటే

Sai Baba

Advertisements

&NewLine;<p>షిరిడి నాధుడు సాయిబాబా విజయదశమి రోజున మహాసమాధి చెందారు&period; విజయదశమి రోజున సాయి మహాసమాధి చెందే ముందు కొన్ని సూచనలు ఇచ్చారు&period; శరీరాన్ని వదిలటానికి కొన్ని రోజుల ముందు వజే అనే ఆయన చేత బాబా రామ విజయం అనే గ్రంధాన్ని చదివించు కున్నారు&period; శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన సారాంశమే ఈ రామ విజయం&period; మొట్టమొదట వజే ఏడు రోజుల్లో రామ విజయం పారాయణం పూర్తి చేశాడు బాబా వారికి మళ్లీ శ్రీరాముడి కధ వినాలన్పించింది&period; వజే అనే అతనిని మళ్లీ రెండోసారి చదవమన్నాడు వజే రాత్రి పగలు చదివి మూడురోజుల్లో రెండవ పారాయణం పూర్తి చేస్తాడు వజే&period; బాబా వారికి మళ్లీ మళ్లి శ్రీరాముడి కధ వినాలన్పించింది&comma; మరల బాబా అతనిని మూడోసారి చదవమంటారు&period; తాను మూడు రోజులు చదివి అలసిపోతాడు&comma; అప్పుడు బాబా గారు అతనికి సెల విచ్చి పంపుతారు&period; ఎవరైనా శరీరాన్ని వదిలేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారి వారి మత గ్రంధాలు చదవడం ఆనవాయితి&period; అలానే పరీక్షిత్ మహారాజుకు ముని కుమారుడు శృంగి శాపం వలన తక్షకుడి ద్వారా మరణం తప్పదని తెల్సినప్పుడు శుక బ్రహ్మ ఏడురోజులలో పరీక్షిత్ కు భాగవతం చెప్పి ఆయనను అనుగ్రహించాడు&period; బాబా పరమాత్మ అయినా సంప్రదాయాన్ని అనుసరించి రామవిజయ పారాయణ చేయించారు&period; బాబా చివరిక్షణం వరకు అనేక సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పారు&period; దేహం పడిపోటానికి రెండు మూడు రోజుల ముందు భిక్షకు వెళ్లడం మానేశారు&period; కాకా సాహెబు దీక్షిత్ మరియు శ్రీమాన్ బూటీగారు ద్వారకామాయిలోనే భోజనం చేసేవారు&period; 1918 అక్టోబర్ 15 వతేది నాడు బాబా వారిని వాడా కు వెళ్లి భోజనం చేయమని ఆజ్ఞాపిస్తారు&period; అక్కడ ఇంకా లక్ష్మి బాయి&comma; భాగోజి షిండే&comma; భయ్యాజీ&comma; బాలా షిమ్పే మరియు నానాసాహెబ్ నిమోన్కర్&comma; శ్యామా ఉంటారు&period; లక్ష్మి బాయికి తొమ్మిది నాణాలు ఇచ్చిన తరువాత బాబా ఇలా అంటారు మసీదులో తనకు బాగాలేదని&comma; తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకు పోయిన బాగుండునని చెప్పారు&period; ఇలా అంటూ భయ్యాజీ మీదకు ఒరిగి ప్రాణములను విడుస్తారు&period; భాగోజి ఈ విషయం నిమోన్కర్కు చెప్పగా&comma; ఆయన బాబా నోటిలో కొంచెం నీరు పోస్తే అది కాస్తా బయటకు కారిపోతుంది&period; అప్పుడు నిమోన్కర్కు దేవా&excl; అంటూ ఆర్తితో పిలవగా బాబా మెల్లగా &&num;8220&semi;ఆ&&num;8221&semi; అని కల్లుతెరచి చూసి ఇక తరువాత తమ భౌతిక శరీరం వదిలివేస్తారు&period; బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు బాబా ఎప్పుడు తన దగ్గరే ఉంచుకొని అపురూపంగా చూసుకునే ఇటకరాయి రెండు ముక్కలు అవుతుంది&period; మసీదును శుభ్రపరిచే ఒక పనికుర్రవాడు పొరపాటున ఆ ఇటకరాయిని శుభ్రం చేస్తూ క్రింద పడవేస్తాడు&period; అప్పుడు అది రెండు ముక్కలు అవుతుంది&period; బాబా వచ్చి ఈ విషయం తెలుసుకొని ఇది ఇటుక కాదు&period; నా అదృష్టమే ముక్కలు అయి పోయినది&period; అది నా జీవితపు తోడూనీడ&period; దాని సహాయం వలననే నేను నిత్యం ఆత్మానుసంధానము చేసేవాడిని&period; ఈ రోజు అది నన్ను విడిచినది అని అన్నారు&period; ఈ ఇటుకపై బాబాకు ఇంత ప్రేమా అని మనకి సందేహంకలుగవచ్చు&period; కాని దీని విషయం బాబాకే తెలియాలి&period; వారు సుద్ద చైతన్యులు&period; వారికి ఈ అశాశ్వతమైన వాటి మీద మమకారం ఉండదు&period; ఈ ఇటుక గురు భక్తికి ప్రతీకగా కొందరు చెప్తారు&period; ఇక అప్పటికే షిర్డీ అంతా బాబా మహాసమాధి చెందిన వార్త తెలిసి ప్రజలు అందరు అక్కడకు వస్తారు&period; వారందరిలో తరువాత జరుగవల్సిన కార్యక్రమం పై చర్చలు జరిగాయి&period; ఎలా సమాధి చేయాలి అనే అంశం మీద చర్చ జరిగింది&period; ముస్లిం భక్తులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధి చేసి గోరి కట్టాలి అని నిర్ణయించారు&period; కాని రామచంద్ర పాటిల్ మిగిలిన గ్రామస్థు లందరితో కలిసి బాబావారిని వారు కోరిన విధంగా బూటీ వాడాలో ఉంచాలి అని తీర్మానించారు&period; ఈ రెండు వాదనల ఎటు తేలకపొతే అందరిలో కలవరపడ్డారు&period; అప్పుడు కొందరు అధికారులు వచ్చి ఈ విషయమై ఎన్నిక జరగాలి అని నిశ్చయించితే ఎక్కువ ఓట్లు బాబా కోరిన దాన్నే బలపరుస్తాయి&period; అప్పుడు బూటీ వాడాలో ఎక్కడైతే మురళీధరుని ఉంచాలి అనుకున్నారో అదే స్థానంలో బాబా శరీరాన్ని ఉంచుతారు&period; ఇక్కడ నిమోన్కర్కు గారు ఆశ్ఛర్యకరమైన విషయం చెప్పారు&period; బాబా శరీరం 36 గంటల తరువాత కూడా ఏమి పాడవకుండా ఉంది&period; ఆయన కఫినీని చింపకుండా తీయగలిగారు&period; బాలాసాహెబ్ భాటే&comma; ఉపాసినీ బాబా కలిసి జరగవలిసిన కార్యక్రమాలు దగ్గర ఉండి పూర్తి చేశారు&period; జీవన్ముక్తు లైనవారికి ప్రాపంచిక పరంగా అందరి లాగా భౌతికమైన ఆలంబన ఉండదు&period; కాని అందరి లాగా వారు ప్రవర్తించవచ్చు&period; బాబావున్నప్పటి నుంచి షిరిడిలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించేవారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..