విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్

missbevhing teacher

Advertisements

&NewLine;<p>గురు బ్రహ్మ&period;&period; గురు విష్ణు&period;&period; గురుదేవో మహేశ్వర అనే సూక్తికి మచ్చని తీసుకు వస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు&period; విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే వక్రబుద్ధితో విధ్యార్హులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా&comma; అశ్వారావుపేట మండలంలోని ఊట్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినీ&comma; విద్యార్థులు పట్ల అదే స్కూల్లో పనిచేస్తున్న టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు&period; గత శనివారం మధ్యాహ్నం పాఠశాలలో ఇతర టీచర్లు లేని సమయంలో విద్యార్థులను స్టాఫ్ రూమ్ కి పిలిపించి వారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తమకు పిల్లలు చెప్పారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు&period; సోమవారం ఉదయం స్కూల్ ప్రారంభం కాగానే విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని తమ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు&period; కీచక టీచర్ ఈరోజు పాఠశాలకు హాజరు కాకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపారు&period; స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు ఇతర టీచర్లు&comma; విద్యార్థులతో మాట్లాడి విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.

తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.

సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.