తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటల వరకు 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం, అత్యల్పంగా హైదరాబాద్లో 20.79 శాతం నమోదయింది. రాజధాని నగరంతో పోల్చుకుంటే గ్రామీణ తెలంగాణలో పోలింగ్ ఎక్కువగానే ఉంది. రంగారెడ్డిలో 29 శాతం, మేడ్చల్ మల్కాజిగిరిలో 26 శాతం నమోదయింది. ఓటర్లు పోలింగ్ స్టేషన్కు వెళ్లేందుకు ఆసక్తి చూపక పోవడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. హైదరాబాదీలు దయచేసి బయటకు వచ్చి ఓటు వేయండి. మీకు పోలింగ్ రోజున సెలవు ప్రకటించింది. ఓటు వేయడం కోసమేనని గుర్తుంచుకోండి అని అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు. చిరంజీవి, సాయిధరమ్ తేజ్, సుమ కనకాల, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ఓటు వేసి, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ హైదరాబాద్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పుడు కూడా 54 శాతం ఓటింగ్ మించలేదు. దీంతో ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతిచోట ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రచారాలు నిర్వహించారు.
మధ్యాహ్నం 1గంటకు 36% పోలింగ్ నమోదు
77
previous post