Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Telangana పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టుల బాటిల్ బాంబ్

పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టుల బాటిల్ బాంబ్

by Satya
IED bomb

పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ లోని చర్ల మండలం అంజనీపురం దారిలో భద్రతా బలగాలు పోలీస్ జాగిలాలతో రూట్ మార్చ్ జరిపారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును పోలీస్ జాగిలాలు పసిగట్టాయి. వెంటనే అప్రమత్తం అయిన బలగాలు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బందిని రప్పించి దానిని నిర్వీర్యం చేయించారు. ఈ ఘటన అనంతరం భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత చర్లలో పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న రాజకీయ నాయకులను ఏఎస్పీ పరితోష్ పంకజ్ బయటికు పంపించారు. అనంతరం ఆయన అక్కడ భద్రతను పర్యవేక్షించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: