తాడిపత్రి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి యువ చైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టి పెద్దవడుగూరు, యాడికి, పెద్దపప్పూరు మండలాలలో పూర్తి చేశారు. నాలుగవ విడుత లో భాగంగా తాడిపత్రి మండలంలోని యర్రగుంటపల్లి, రావి వెంకటాంపల్లి, చిన్నపల్లి, తాతగారిపల్లి, కోమలి, చిన్నపడమల, పెద్ద పడమల గ్రామాలలో మొదటిరోజు టిడిపి నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి యువ చైతన్య బస్సు యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాలలో మహిళలు, యువకులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారని సంపద సృష్టించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. టిడిపి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. టీడీపి జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు అందజేశారు. ఈ బస్సు యాత్రలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి అస్మిత్ రెడ్డి పాల్గొన్నారు.
4వ విడత యువ చైతన్య బస్సు యాత్ర…
63
previous post