పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈరోజు భీమవరం వేదికగా విద్యా దీవెన నగదును బటన్ నొక్కి ఎనిమిది లక్షల తొమ్మిది వేలమంది విద్యార్థుల ఖాతాలో 584 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. జివిఆర్ జూనియర్ కళాశాల వద్ద బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. సీఎం బహిరంగ సభ హెలిప్యాడ్ ప్రాంతాల ఏర్పాట్లను, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోహన్ రాజు, మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీప్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్ పరిశీలించారు. సీఎం జగన్ పర్యటన నేపద్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుకట్టమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 10 గంటలకు గుంటూరు తాడేపల్లిగూడెం నుండి బయలుదేరి 10:45 నిమిషాలకు భీమవరం లూధరన్ గ్రౌండ్ హెలిప్యాడ్ కు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన బహిరంగ సభ ప్రాంతానికి వస్తారని తెలిపారు. కావున సీఎం పర్యటనను నియోజకవర్గ ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు.
విద్యార్థుల ఖాతాలోకి 584 కోట్లు జమ
88
previous post