లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో జరిగిన పోలింగ్లో 63.37 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 11.13 కోట్ల మంది ఓటర్లకు 7.05 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపింది. ఇందులో పురుషుల ఓటింగ్ శాతం 61.95శాతం కాగా, మహిళలది 64.95శాతంగా ఉంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 82.71శాతం ఓటింగ్ నమోదుకాగా.. ఉత్తరప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో 54.04శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, ఢిల్లీలో 58.69శాతం, హర్యానాలో 64.80శాతం, ఒడిశాలో 74.45శాతం, జార్ఖండ్లలో 65.39శాతం పోలింగ్ నమోదైంది. లోక్ సభ నియోజకవర్గాల వారీగా పశ్చిమ బెంగాల్లోని బిష్ణుపూర్లో అత్యధికంగా 85.91శాతం ఓటింగ్ నమోదు కాగా, ఉత్తరప్రదేశ్లోని ఫుల్పూర్లో అత్యల్పంగా 48.91శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 69.58 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఢిల్లీలోని ఏడు స్థానాలతో సహా 58 లోక్సభ నియోజకవర్గాలకు మే 25న పోలింగ్ జరిగింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదలఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో…
- న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం…
- బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాంరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.