లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో జరిగిన పోలింగ్‌లో 63.37 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 11.13 కోట్ల మంది ఓటర్లకు 7.05 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపింది. ఇందులో పురుషుల ఓటింగ్ శాతం 61.95శాతం కాగా, మహిళలది 64.95శాతంగా ఉంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 82.71శాతం ఓటింగ్ నమోదుకాగా.. ఉత్తరప్రదేశ్‌లోని 14 నియోజకవర్గాల్లో 54.04శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, ఢిల్లీలో 58.69శాతం, హర్యానాలో 64.80శాతం, ఒడిశాలో 74.45శాతం, జార్ఖండ్‌లలో 65.39శాతం పోలింగ్ నమోదైంది. లోక్ సభ నియోజకవర్గాల వారీగా పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో అత్యధికంగా 85.91శాతం ఓటింగ్ నమోదు కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్పూర్లో అత్యల్పంగా 48.91శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 69.58 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఢిల్లీలోని ఏడు స్థానాలతో సహా 58 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 25న పోలింగ్ జరిగింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ఈసారి అత్యంత తక్కువ ఉత్పాదకతతో ముగిశాయి. నిర్ణయించిన మొత్తం సమయంతో పోలిస్తే లోక్‌సభలో కేవలం 15 శాతం మాత్రమే కార్యకలాపాలు జరిగాయని PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాలు వెల్లడించాయి. గత రెండు దశాబ్దాల్లో అత్యల్ప ఉత్పాదకత నమోదైన…
- ఐజీఐ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె కలకలం.న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం ఎక్కేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి చేతి సంచిలో దాచి ఉంచిన పుర్రెను సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుడి బ్యాగ్‌ను ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్‌లో…
- NEET రద్దుకు తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.నీట్ రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ మరోసారి గళమెత్తింది. దేశవ్యాప్తంగా NEETను రద్దు చేయాలని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య సీట్ల భర్తీకి అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరింది. అయితే తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.