లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో జరిగిన పోలింగ్‌లో 63.37 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 11.13 కోట్ల మంది ఓటర్లకు 7.05 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపింది. ఇందులో పురుషుల ఓటింగ్ శాతం 61.95శాతం కాగా, మహిళలది 64.95శాతంగా ఉంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 82.71శాతం ఓటింగ్ నమోదుకాగా.. ఉత్తరప్రదేశ్‌లోని 14 నియోజకవర్గాల్లో 54.04శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, ఢిల్లీలో 58.69శాతం, హర్యానాలో 64.80శాతం, ఒడిశాలో 74.45శాతం, జార్ఖండ్‌లలో 65.39శాతం పోలింగ్ నమోదైంది. లోక్ సభ నియోజకవర్గాల వారీగా పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో అత్యధికంగా 85.91శాతం ఓటింగ్ నమోదు కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్పూర్లో అత్యల్పంగా 48.91శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 69.58 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఢిల్లీలోని ఏడు స్థానాలతో సహా 58 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 25న పోలింగ్ జరిగింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సెమీకాన్ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో గురువారం ‘సెమీకాన్ ఇండియా-2026’ సదస్సును ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు…
- ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్చంద్రకు ప్రధాని మోదీ నివాళి.ప్రముఖ బెంగాలీ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి శరత్చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. శరత్చంద్ర సాహిత్య వైభవాన్ని, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని…
- ఉద్యోగులకు కేంద్రం కీలక నిర్ణయం.ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో EPFO వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచేందుకు ఆమోదం లభించింది. 2014 తర్వాత తొలిసారిగా ఈ పరిమితిని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.