Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Telangana ఎన్టీఆర్ 101వ జయంతి..

ఎన్టీఆర్ 101వ జయంతి..

by Rama
NTR

ఎన్‌టీఆర్ 101వ జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని ఎన్‌టీఆర్ ఘాట్‌లో న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ నివాళులు ఆర్పించారు. బాలకృష్ణ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ , పురంధేశ్వరి కూడా ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. రాజ‌కీయ చైత‌న్యం తీసుకొచ్చిన మ‌హ‌నీయుడు ఎన్‌టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్‌టీఆర్ అని, ఆయ‌న స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నార‌ని బాలకృష్ణ తెలిపారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

రైతు కుటుంబంలో పుట్టిన ఎన్‌టీఆర్ మొద‌ట చ‌దువుకే ప్రాధాన్య‌త ఇచ్చారని, ఆ త‌ర్వాత చిత్ర‌రంగంలోకి వ‌చ్చార‌న్నారు. ఆయ‌న‌ అంటే న‌వ‌ర‌సాల‌కు అలంకారం అని అన్నారు. న‌ట‌న‌కు విశ్వ‌విద్యాల‌యం అని కొనియాడారు. సినీ రంగంలో మ‌కుటంలేని మ‌హారాజుగా వెలుగొందుతున్న స‌మ‌యంలోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని బాలకృష్ణ తెలిపారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజ‌కీయ చైత‌న్యం తీసుకొచ్చిన మ‌హ‌నీయుడు అని ప్ర‌శంసించారు. ఎన్‌టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక వైద్యులు, న్యాయ‌వాదులు, అభిమానుల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చార‌ని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మ‌గౌర‌వాన్ని చాటి చెప్పార‌న్నారు. ఆయ‌న తీసుకొచ్చిన‌ ప‌థ‌కాల‌నే అంద‌రూ అవ‌లంబిస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ గుర్తు చేశారు.

  • నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
    నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్‌ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా…
  • జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
    జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్‌ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్‌ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
  • సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
    ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
Advertisements

You may also like

Our Visitor

042280
Total views : 223739

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: