రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదానికి ముందు ఓ యువకుడు క్రాకర్స్ దుకాణం వద్ద సంచరించినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
రాజేంద్రనగర్‌లో సన్‌సిటీ వద్ద క్రాకర్స్ దుకాణంలో శనివారం వేకువజామున భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న దుర్గా భవాని ఫుడ్‌జోన్‌కూ మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మరో మూడు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం నాలుగు దుకాణాల నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు 4 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also..
Read Also..