కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ మాజీ అసెంబ్లీ ఇన్చార్జి గౌని శివకుమార్ గారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు. పోత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలిపిన తెలంగాణ జనసమితి జహీరాబాద్ ఇన్చార్జి మొగుడంపల్లి అశప్ప గారు. కాంగ్రెస్ లో చేరిన మాజీ కౌన్సిలర్ బెజుగం సతీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ అరచక పాలనను సహించలేక ఇవాళా కాంగ్రెస్ పార్టీలో చెరుతున్నం అని అన్నారు. ప్రజాసమస్యలపై అనేక ఉద్యమాలను చేశాం కాని ఎ ఒక్క ప్రజ సమస్య బిఆర్ఎస్ పరిష్కారించలెదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా భూములను గుంజుకోవాడనికి సిద్ధం అవుతున్నాయి అని అన్నారు. జహీరాబాద్ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు గత 4,5 నెలలు గా డబ్బులు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపిస్తుందన్నారు. మళ్లీ బిఆర్ఎస్ వస్తె చెరుకు రైతుల గొంతు కోసి ఫ్యాక్టరీని మూసి వేసి స్క్రాప్ లో అమ్మేస్తారు అని అన్నారు. సుగర్ ఫ్యాక్టరీ రైతులకు డబ్బులు చెల్లించకుండా హరీష్ రావు కుట్ర చేస్తున్నారని అన్నారు. రైతులకు సరైన న్యాయం జరిగే వరకూ పోరాడుతాను. జహీరాబాద్ లో సిద్దిపేట పెత్తనం సాగుతుంది అని అన్నారు. ఉద్యమకారులకు బిఆర్ఎస్ లో విలువ లేదని కాంగ్రెస్ పార్టీ తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ లో ఇప్పుడు ఉన్నవారు అప్పటి తెలంగాణ ద్రొహులె.. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించారు.
Read Also…
Read Also…