ధరణి తీసేస్తే మళ్ళీ దళారి రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ భూమాతను ప్రవేశపెడతామని చెబుతోందని.. అది భూమేతే అవుతుందని ఎద్దేవా చేశారు. తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పైలట్ రోహిత్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. రెండు వందల రూపాయలు ఉన్న పింఛను రూ.2వేలు చేశామన్నారు. రైతుల బాగోగుల కోసం రైతుబంధు ప్రవేశపెట్టామన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే రూ.16వేలు రైతుబంధు ఇస్తామన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుభీమా డబ్బులు ఎలా వస్తాయన్నారు. రైతుబంధు సొమ్ము దుబారా అని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు. అలాంటి కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి ఆగం కావొద్దన్నారు. రాష్ట్రంలో 3500 తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో లంబాడీ బిడ్డలే సర్పంచులుగా రాజ్యమేలుతున్నారన్నారు. బంజారా గౌరవానికి చిహ్నంగా బంజారాహిల్స్‌లో బంజారా భవన్ నిర్మించామని చెప్పారు.
Read Also….
Read Also….