69
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అజెండా ఒక్కటేనని, స్వలాభం కోసమే వాళ్లు పని చేస్తారని యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ విమర్శించారు. వేములవాడలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరోనా వ్యాక్సిన్ ఇచ్చేదా? పేదలకు ఉచితంగా కాంగ్రెస్ బియ్యం ఇచ్చేదా?అని ప్రశ్నించారు.ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అంటే కేసీఆర్ కు భయమని ఎద్దేవా చేశారు. యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ స్పీడుతో ఉపాధి, శాంతిభద్రతలు కల్పించడం అని యోగి అన్నారు. తెలంగాణ పరిస్థితి మారాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని అన్నారు.