రోడ్లపై రాసులుగా పోసివున్న ధాన్యాన్ని చూసి చలించిపోయిన వర్ల కుమార్ రాజా ప్రభుత్వ అనాలొచిత నిర్ణయాల వల్లే రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులు వారం రోజుగా సంచులు, రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్న ప్రభుత్వం స్పందించలేదని ఆయన అన్నారు. లారీలకు జిపిఎస్ ట్రాకింగ్ విధానాన్ని రద్దుచేసి… వారం రోజుల క్రితం ఆఫ్లైన్లో ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు నేడు ఈ దుస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. సకాలంలో గోన్ సంచులు సరఫరా చేయకపోవడం, లారీలను పెంచకపోవడంతోనే రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు లాభ పడింది లేదని విమర్శించారు. 50 ఏళ్ల చరిత్రలో రైతులకు ఇలాంటి దయనీయమైన దీనావస్థ ఎప్పుడు లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ దుస్థితి సంభవించింది తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కుమార్ రాజా హాట్ కామెంట్స్…
57
previous post