81
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఆయన తన ఛాంబర్ లో స్వీకరణ కార్యక్రమం పూర్తిచేశారు. అంతుకు ముందు ఆయనను వేద పండితులు ఆశీర్వదించారు. యాదాద్రితోపాటు పలు ప్రధాన ఆలయాల నుంచి వచ్చిన పూజారులు ముఖ్యమంత్రికి ప్రసాదాలు అందజేశారు. సచివాలయానికి వచ్చిన రేవంత్ నిర్ణీత సమయానికి తన ఛాంబర్ లో ప్రవేశించారు. పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు బాధ్యతలు తీసుకున్నారు.