తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ కేటాయించారు. ఇక ఆర్మీ మాజీ అధికారి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి హోంశాఖ ఇచ్చారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. పురపాలశాఖ మంత్రిత్వశాఖను నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చారు. ఇక ములుగు నుంచి ఎన్నికైన సీతక్కకు గిరిజనశాఖ కేటాయించారు. ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల శాఖ ఇచ్చారు. గతంలోనూ ఆయన ఇదే శాఖ నిర్వహించడం గమనార్హం. ఇక ఆందోల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన దామోదర రాజనర్సింహ ఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు. పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సాగునీటిపారుదల శాఖ కేటాయించారు. పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమం, కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమం ఇవ్వగా జూపల్లి కృష్ణారావు పౌర సరఫరాల శాఖ నిర్వహంచనున్నారు.
Read Also..
Read Also..