పల్నాడు జిల్లా కలెక్టర్ ని కలిసిన టీడీపీ నేతలు జివి ఆంజనేయులు, జూలకంటి బ్రమ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు జిల్లాలో ఓట్ల అవకతవకలపై కలెక్టర్ కి ఫిర్యాదు…..
మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ
BLO ల మీద వైసీపీ నేతలు ఒత్తిడి చేసి మా ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని, అధికారులు మా ఫిర్యాదులపై కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. మత్తుకుమల్లిలో బ్రతికున్న నలబై మంది ఓట్లు తొలగించారని, తొలగించిన ఓట్ల గురించి మేము పూర్తి ఆధారాలతో పిర్యాదు ఇస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు భారీ ఎత్తున ఓట్ల అవకతవకలకు పాల్పడ్డారని, వైసీపీ నేతలు ఫిర్యాదు ఇవ్వగానే వెంటనే మా ఓట్లను అధికారులు తొలగిస్తున్నారని ఆయన అన్నారు. వెల్లటూరు గ్రామంలో వైసీపీ నేతలు 160 దొంగ ఓట్లను చేర్చారని, ఓటమి భయంతోనే అధికార పార్టీ వారు దొంగ ఓట్లను చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. తప్పలు చేసిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నూతన జాబితాలో మాకు అన్యాయం జరిగితే తప్పకుండా మేము కోర్టుకి వెళతామని, ఇప్పుడు తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టమని ఆయన తెగేసి చెప్పారు.
మాచర్ల టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రమ్మారెడ్డి మాట్లాడుతూ
మేము దొంగ ఓట్లపై ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదనిం, ఓట్ల విషయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. మా ఓట్ల విషయంలో అధికారులు న్యాయంగా వ్యవహరించడం లేదని, నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు, మేము గడిచిన ఆరు నెలలుగా దొంగ ఓట్లపై పోరాటం చేస్తున్నా అధికారులు స్పందిoచడం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఓటర్ లిస్ట్ వ్యవహారం జరుగుతుందని ఈరోజు ఉన్న ఓటు రేపు ఉంటుందో లేదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఓట్లపై సామాన్యులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని మీ ఓటుపై మీరు జాగ్రత్త పడితే మంచిదని ఆయన అన్నారు.