మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరుచేసి, నీటిని పూర్తిగా తొలగించిన… వైఫల్యానికి గల కారణాలను అధ్యయనం చేయనున్నట్లు డ్యాం సేఫ్టీ అథార్టీ తెలిపింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని సమాచారమివ్వాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ పేర్కొంది. జాతీయ అథార్టీ, సీడబ్ల్యూసీ అధికారుల బృందం మళ్లీ పరిశీలించి.. వైఫల్యానికి దారి తీసిన కారణాలను మరింత లోతుగా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిశీలనాంశాలను తప్పనిసరిగా తమకు పంపాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలోని జాతీయ అథార్టీ తెలంగాణ రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీకి తాజాగా లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజి కుంగడం, పియర్స్ దెబ్బతినడంతో జాతీయ అథార్టీ అధికారులు పరిశీలించి తమ అభిప్రాయాలతో గతంలోనే నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. ఇందులోని అంశాలతో నవంబరు ఒకటిన రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి.. కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఇందులో డిజైన్, నిర్మాణం, నిర్వహణ, నాణ్యతా లోపాలతో పాటు వైఫల్యానికి కారణాలను వివరంగా పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. బ్యారేజి కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడంలో సహకరించాల్సిందిపోయి నిందారోపణలు చేయడం తగదంటూ కేంద్రానికి సమాధానమిచ్చింది.
వైఫల్యానికి గల కారణాలను మళ్లీ పరిశీలిస్తాం
219
previous post