109
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వైసిపి నేతల కబ్జాలకు అంతులేకుండా పోతోందని జనసేన విమర్శించింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మరియు అనుచరులు రోజుకూ కోటి రూపాయలు దోచుకుంటన్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర ఆరోపించారు. ప్రొద్దుటూరులో సామాన్య ప్రజల జీవితం దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జనసేన – టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుపరిపాలన అందిస్తామని నాగేంద్ర తెలిపారు.