వివిధ ఆందోళనల సమయంలో మాలలు, మాదిగలపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది, క్యాంపు కార్యాలయంలోముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన ఎస్సీ మంత్రులు, ఇతర ఎస్సీ ప్రజాప్రతినిధులు, నాయకులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఏమన్నారంటే…
మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి :
ఎస్సీలపై చంద్రబాబు హయాంలో కేసులు పెట్టి వేధించారని, ఎస్సీలను తీవ్రంగా దెబ్బతీశారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈ ప్రభుత్వం దళితులకు అండగా నిలబడుతూ ఎన్నడూ చూడని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దళితుల అభ్యున్నతికి పాటుపడిందన్నారు. అడిగినవే కాదు, అడగనివి కూడా ముఖ్యమంత్రి ఇచ్చారన్నారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆగ్మగౌరవాన్ని మరింతగా పెంచారన్నారు.
ఆదిమూలపు సురేష్, పురపాలక,పట్టణాభివృద్ధిశాఖమంత్రి :
అంబేద్కర్ గారి ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేసిందని, ఏ సమస్య ఉన్నా నేరుగా చెప్పుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారని, దళితుల బాధలు, కష్టాలు ఆయనకు తెలుసని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. దళిత సమాజమంతా ఆయనకు బాసటగా నిలుస్తుందన్నారు.
జూపూడి ప్రభాకరరావు, ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) :
వచ్చే ఎన్నికల్లో జగన్‌గారిని దెబ్బతీయడానికి ప్రత్యర్థులంతా ఏకం అవుతున్నారని, ఈ సమయంలో కుడిభుజంగా దళితులు నిలబడి పనిచేస్తారని ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ అన్నారు. జగన్‌గారు అధికారంలో ఉంటేనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. అణగారిన వర్గాలకు ఆసరాగా నిలిచేది శ్రీ వైయస్.జగన్ మాత్రమేనని అన్నారు.