ప్రకాశం జిల్లా దరిశి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఒంగోలు ఎద్దుల పందాలు కార్యక్రమంను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఇన్చార్జి మంత్రి మెరుగు నాగార్జున ప్రారంభించారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో న్యూ క్యాటగిరి, సీనియర్ విభాగం పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం ఇవి రెండు కళ్లలా భావించి ఏ ముఖ్యమంత్రి పరిపాలించనంత సుభిక్షంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు. మీకు సంక్షేమ పథకాలు అందితేనే మాకు ఓటు వేయండి అని ధైర్యంగా మీ ముందుకు వస్తున్నాం అన్నారు. ప్రతిపక్షాలు పొత్తుల్లో భాగంగా రెండు మూడు కండువాలు వేసుకొని కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దర్శి నియోజకవర్గంలో మరోసారి బూచేపల్లినీ సమన్వయకర్తగా అవకాశం ఇస్తారని మీరు మరోసారి ఆదరించి గెలిపించాలని మంత్రి అన్నారు. దరిశి లో బూచేపల్లి గెలిస్తే రాష్ట్రంలో జగనన్న గెలుస్తాడని ఆయన అన్నారు.
Adimulapu Suresh
మార్కాపురం గడియార స్తంభం సెంటర్ లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించి “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమాన్ని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నజాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఎస్పి వీరరాఘవ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు.. స్థానిక గడియారం వద్ద నుండి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ లో మున్సిపల్, పంచాయితీ, సచివాలయ అధికారులు, వాలింటర్లు పాల్గొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఆటల పోటీలను ప్రారంభించారు.
వివిధ ఆందోళనల సమయంలో మాలలు, మాదిగలపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది, క్యాంపు కార్యాలయంలోముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన ఎస్సీ మంత్రులు, ఇతర ఎస్సీ ప్రజాప్రతినిధులు, నాయకులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఏమన్నారంటే…
మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి :
ఎస్సీలపై చంద్రబాబు హయాంలో కేసులు పెట్టి వేధించారని, ఎస్సీలను తీవ్రంగా దెబ్బతీశారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈ ప్రభుత్వం దళితులకు అండగా నిలబడుతూ ఎన్నడూ చూడని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దళితుల అభ్యున్నతికి పాటుపడిందన్నారు. అడిగినవే కాదు, అడగనివి కూడా ముఖ్యమంత్రి ఇచ్చారన్నారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆగ్మగౌరవాన్ని మరింతగా పెంచారన్నారు.
ఆదిమూలపు సురేష్, పురపాలక,పట్టణాభివృద్ధిశాఖమంత్రి :
అంబేద్కర్ గారి ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేసిందని, ఏ సమస్య ఉన్నా నేరుగా చెప్పుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారని, దళితుల బాధలు, కష్టాలు ఆయనకు తెలుసని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. దళిత సమాజమంతా ఆయనకు బాసటగా నిలుస్తుందన్నారు.
జూపూడి ప్రభాకరరావు, ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) :
వచ్చే ఎన్నికల్లో జగన్‌గారిని దెబ్బతీయడానికి ప్రత్యర్థులంతా ఏకం అవుతున్నారని, ఈ సమయంలో కుడిభుజంగా దళితులు నిలబడి పనిచేస్తారని ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ అన్నారు. జగన్‌గారు అధికారంలో ఉంటేనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. అణగారిన వర్గాలకు ఆసరాగా నిలిచేది శ్రీ వైయస్.జగన్ మాత్రమేనని అన్నారు.





Total views : 80393