తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు యధావిధిగా జరగనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్లో ఉన్న 39,784 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు ఏర్పాట్లు చేనుంది. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కోసం 14 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐ ఎన్ టి యు సి, సిపిఐ అనుబంధ ఎఐటియుసి, బిఅర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, బిజెపి అనుబంధ బిఎంఎస్ తో పాటు హెచ్ఎంఎస్ సంఘాలతో పాటు విప్లవ సంఘాలు బరిలో నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గత రెండు పర్యాయాలు గుర్తింపు సంఘం గా వ్యవహరించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ను కార్మికులు తిరిగి ఆదరిస్తారా లేక మరో సంఘానికి పట్టం కడతారా వేచి చూడాలి.
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
89
previous post