జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరికాసేపట్లో సింగరేణి ఎన్నికల ప్రచారం ముగియనున్నది. గుర్తింపు సంఘం కోసం జరిగే ఎన్నికల్లో కార్మిక సంఘాల నేతలు పోటాపోటిగా ప్రచారం చేసారు. ప్రచారంలో కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, మరియు బిఆరెఎస్ & కమ్యూనిస్ట్ నేతలు పాల్గొన్నారు. ఈరోజు 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నది. 27న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. అనంతరం కౌంటింగ్ జరుగుతుంది. అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సింగరేణి అధికారులు, కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 6 జిల్లాలు, 12 నియోజకవర్గాలు, 13 ఏరియాలలో మొత్తం 39991 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు అలాగే 14 గుర్తింపు కార్మిక సంఘాలున్నాయి. భూపాలపల్లిలో మొత్తం మైన్స్ పై 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. 5350 మంది ఓటును నమోదు చేసుకున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల పోటీలో INTUC, AITUC, TBGKS, CITU, HMS, BMS కార్మిక సంఘాలున్నాయి.
BMS
సింగరేణిలో ఏడో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. సింగరేణిలో అన్ని పార్టీలు తమ సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమించాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 40 వేల మంది కార్మికులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టియుసి కూడా విజయ కేతనం ఎగుర వేసేందుకు ఊవ్విళ్లూరుతోంది. బిఆర్ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసి యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొన సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి ఉనికి కోసం ఉబలాటపడుతున్నాయి.
తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు యధావిధిగా జరగనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్లో ఉన్న 39,784 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు ఏర్పాట్లు చేనుంది. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కోసం 14 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐ ఎన్ టి యు సి, సిపిఐ అనుబంధ ఎఐటియుసి, బిఅర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, బిజెపి అనుబంధ బిఎంఎస్ తో పాటు హెచ్ఎంఎస్ సంఘాలతో పాటు విప్లవ సంఘాలు బరిలో నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గత రెండు పర్యాయాలు గుర్తింపు సంఘం గా వ్యవహరించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ను కార్మికులు తిరిగి ఆదరిస్తారా లేక మరో సంఘానికి పట్టం కడతారా వేచి చూడాలి.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో డిశంబర్ 27న సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో 39,748 మంది సింగరేణి కార్మికులకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించబోతున్న సింగరేణి కాలరీస్ కంపెనీ (sccl) యాజమాన్యం. సింగరేణి కొల్ బెల్ట్ ఏరియాలో మందమర్రి డివిజన్ లొ 11 పోలింగ్ బూత్‌లను ఖరారు చేసారు. మందమర్రి డివిజన్ లొ 5,300 మంది కార్మికులు ఉన్నారు. మందమర్రి మండలంలో డిశంబర్ 27న జరగబోయే ఎన్నికల పోలింగ్ బూత్ లలొ ఓటు హక్కు వినియోగించుకొనున్న సింగరేణి కార్మికులు. సింగరేణి ఎన్నికల కోసం బూత్ ప్రక్రియ ఏర్పాట్లు చేస్తున్న సింగరేణి అధికారులు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగును. అదే రోజు సాయంత్రం మందమర్రి (CER CLAB) సీఈఆర్ క్లబ్ కౌంటింగ్ కేంద్రంలొ 6 గంటల నుంచి ఓట్లు కౌంటింగ్ చేసే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో, ఏఐటీయూసీ,(చుక్క) టీబిజికేఎస్, (బాణం ) ఐఎన్టియూసీ,(గడియారం ) గుర్తు లతో మరియు CITU, HMS, BMS,TNTUC, IFTU, జాతీయ ప్రాంతీయ యూనియన్ సంఘల నాయకులు ఈ సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ప్రచారం ఉదృతం చేస్తున్న పలు యూనియన్ నాయకులు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు అవ్వకముందే సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి డేట్ ఫిక్స్ అయ్యింది. సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అది పోస్ట్ పోన్ చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్ కమిషనర్ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు సమక్షంలో జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్టీయూ, ఇతర సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావడంతో 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల ఓటరు లిస్ట్‌ను ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు.





Total views : 78968