ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలనైనా తూచ తప్పకుండా పాటించాలన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన మాయమాటలతో మభ్యపెట్టి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ యూత్ డ్లిక్లరేషన్ లో పేర్కొన్నారని కానీ నిన్న సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట మార్చి తాము ఎక్కడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని అంటున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 9వ తేదీన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సభలో ఆ అంశాన్ని ప్రస్తావించడం లేదన్నారు. ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం మాట తప్పే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజల పక్షాన కొట్లాడుతామన్నారు.
కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
100
previous post