టీడీపీ అధినేత, మాజీ సీఎంచంద్రబాబు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరికొన్ని నెలల్లో ఎన్నికల జరగనున్న వేళ బాబు, పీకే కలవడం రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపింది. ఈ క్రమంలో బాబు, పీకే భేటీపై వైసీపీ సీనియర్ నేత, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి ప్రాణం పోయడానికి ప్రశాంత్ కిశోర్ పనికిరాడని.. చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే ప్రశాంత్ కిశోర్ పనికొస్తారని ఎద్దేవా చేశారు. గతంలో ప్రశాంత్ కిశోర్‌ను చంద్రబాబు బీహార్ డెకాయిట్ అని విమర్శించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం మళ్లీ అతడితోనే బాబు చేతులు కలిపాడని విమర్శలు గుప్పించారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు, లోకేష్ ఎలా దిగజారుతారో గుర్తు చేసుకోండని అన్నారు. ఎంతమంది ప్రశాంత్ కిశోర్‌లు వచ్చినా.. ఎంతమంది పవన్ కల్యాణ్‌లు వచ్చినా, ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం మాత్రం అసాధ్యమని సెటైర్ వేశారు.
ప్రాణం పొయ్యడానికి కాదు…పోస్టుమార్టం చేయడానికి మాత్రమే
50
previous post