మంత్రి అంబటి రాంబాబు కి మాజీ మంత్రి ఆలపాటి రాజా కౌంటర్ ఇచ్చారు. శవాలను గుట్టలుగా వేసుకొని పోస్టు మార్టం మీరు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. సకాలంలో కాల్వ తవ్వలేని, మురుగు కాల్వ బాగుచేయలేని మంత్రి అంబటి రాంబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా రాజకీయ మనుగడ లేని వ్యక్తి అంబటి రాంబాబు అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ మండి పడ్డారు. సంక్షేమ ముసుగులో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి మద్యపానాన్ని నిషేదిస్తాను అన్న మాట తప్పారు అంటూ ఎద్దేవా చేశారు.
minister ambati rambabu
టీడీపీ అధినేత, మాజీ సీఎంచంద్రబాబు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరికొన్ని నెలల్లో ఎన్నికల జరగనున్న వేళ బాబు, పీకే కలవడం రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపింది. ఈ క్రమంలో బాబు, పీకే భేటీపై వైసీపీ సీనియర్ నేత, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి ప్రాణం పోయడానికి ప్రశాంత్ కిశోర్ పనికిరాడని.. చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే ప్రశాంత్ కిశోర్ పనికొస్తారని ఎద్దేవా చేశారు. గతంలో ప్రశాంత్ కిశోర్‌ను చంద్రబాబు బీహార్ డెకాయిట్ అని విమర్శించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం మళ్లీ అతడితోనే బాబు చేతులు కలిపాడని విమర్శలు గుప్పించారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు, లోకేష్ ఎలా దిగజారుతారో గుర్తు చేసుకోండని అన్నారు. ఎంతమంది ప్రశాంత్ కిశోర్‌లు వచ్చినా.. ఎంతమంది పవన్ కల్యాణ్‌లు వచ్చినా, ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం మాత్రం అసాధ్యమని సెటైర్ వేశారు.
పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి అంబటి…పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం,సీఎం అని అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం, చంద్రబాబు సీఎం అంటున్నాడు. ఎందుకంటే పవన్ కి క్యాష్ కొడితే వెళ్ళిపోతాడు.పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు తెలియవు. అతను రాజకీయాలకు పనికిరాడు. అతను నమ్మి వెళితే కుక్కతోక పట్టుకొని గోదారి వీధినట్టే… జగనే ఎందుకు మళ్ళీ సీఎం కావాలంటే,
సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం జగన్ రావాలన్నారు
పల్నాడు జిల్లా… రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో పవన్ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి రాంబాబు. పవన్ కళ్యాణ్ పై అంబటి ఘాటు కామెంట్స్ మా వాళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ సూట్ కేసులు క్యాష్ తీసుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేసే నీచమైనటువంటి రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వచ్చిన వారిని మళ్ళా ఇంటికి పంపిస్తారు ఈ రాష్ట్ర ప్రజానీకం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపికి సపోర్ట్ చేస్తారంట. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జెండా ఎత్తేశారు. పవన్ అక్కడ భారతీయ జనతా పార్టీ మోడీకి, ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు. అక్కడ అలా ఇక్కడ ఇలా ఏమిటో ఎవరికి అర్థం కాదు. ఏప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్. కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులను ఎన్టీ రామారావు పవన్ కళ్యాణ్ చెప్పారు. నావల్ల నా ప్రభుత్వం వల్ల మేలు జరిగితే ఓటెయ్యండి.
అని అడిగిన మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంటికి ద్రోహం చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు. ఉద్యోగాలు ఇస్తానని, ఋణ మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. వైసీపీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి దార్శనియంగా ఉన్నాయన్నారు. అందరూ సమిష్టిగా పనిచేసి జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మంత్రి అంబటి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ మంత్రి అంబటి రాంబాబు క్రమం తప్పకుండా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జనసేన పొత్తులకు సంబంధించి ఆయన సెటైర్లు వేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు. విలువలు లేని మీకే ఇది సాధ్యమని ఎద్దేవా చేశారు.తెలంగాణలో 11 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ… 8 స్థానాలను ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే, హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి స్థానం కూడా కావాలని జనసేన పట్టుబడుతోంది. బీజేపీలో సైతం ఈ స్థానంపై తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ ఆయనను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.





Total views : 75430