ఆలయంలో పురాతన రాతి మండపాలు ఏవి తొలగించలేదని, 1956 లో పోటుకు అనుబంధంగా ఏర్పాటు చేసుకున్న స్షోర్ రూమ్ సిమెంట్ కట్టడం శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని తొలగించి అక్కడ ఆశీర్వాద మండపముగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వాస్తవాలకు విరుద్ధంగా పురాతన కట్టడాలు కూల్చివేసినట్టు మాట్లాడడం తగదు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయం లోపలికి ఫోన్లు తీసుకెళ్లి సెల్ఫీలు చిత్రీకరించుకోవడం తగదని దీనిపై సంబంధిత అధికారులపై డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటామని, అధికారుల వివరణ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సుధీర్ రెడ్డి పై తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితమే పోటు వద్ద ఉన్న స్టోర్ రూమ్ స్థానంలో ఆశీర్వాద మండపం చేయాలని ధర్మకర్తల మండలి తీర్మానించిందని తెలిపారు. తమ ధర్మకర్తల మండలి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి క్షేత్ర ప్రతిష్ట పెంచే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని అసంబద్ధమైన ఆరోపణలతో ఆలయ ప్రతిష్ట రాజకీయాల కోసం దెబ్బతీయొద్దని కోరారు. స్టోర్ రూమ్ సిమెంట్ కట్టడం తొలగింపులో విగ్రహాలు ఏమీ లేవని, ఆగమ విరుద్ధమైన పనులు ఏమీ చేయలేదని దీనిపై ప్రమాణం చేయడానికి బొజ్జల సుధీర్ రెడ్డి రావాలని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సవాల్ చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి స్వగ్రామంలోని నీలకంటేశ్వర స్వామి ఆలయానికి మహా కుంభాభిషేకం తమ హయాంలోనే చేస్తున్నామని గుర్తు చేశారు. గత 40 ఏళ్లు గా నిరాధారణకు గురైన అనుబంధ ఆలయాలకు పూర్వ వైభవం కల్పిస్తున్నామని తెలిపారు. స్వామి వారి డిపాజిట్లు 236 కోట్లు ఉందని, వాస్తవాలు తెలుసుకొని సుధీర్ రెడ్డి మాట్లాడాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ అమలు అత్యంత ఆవశ్యమని, దీనిపై మరో వారం రోజుల్లో ఉన్నత స్థాయి సమావేశం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్వహించనున్నట్లు తెలిపారు. రద్దీ సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా శివయ్య గోపురం వద్ద 45 లక్షలతో వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా రాహు కేతు పూజ మండపాలని ఆలయ ప్రాకారంలోకి తీసుకువచ్చి టైం స్లాట్ విధానం కూడా అమల్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ వేద పండితులు అర్ధగిరి మాట్లాడుతూ ఆలయం లోపల ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఎలాంటి పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. అనుభవం లేని కాంట్రాక్టర్లు దేవస్థానంలో పనులు చేయడం లేదని, ఊరందూరు నీలకంటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తి అనుభవం ఉన్న కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా ఆలయ ప్రతిష్ట పెంచే విధంగా వ్యవహరించాలని, మన ఆలయం మన క్షేత్రం ప్రతిష్ట కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సుధీర్ రెడ్డి తెలుసుకోవాలని హితవు చెప్పారు. అదేవిధంగా మీ తండ్రి గారు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు ఏ ఒక్క రోజైనా శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఎన్ని దేవాలయాలు కట్టించారు అని చెప్పండి. మా శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 116 శ్రీరామ మందిరం లూ రాష్ట్ర ప్రభుత్వం చే నిధులు మంజూరు చేశారు అది కూడా నిర్మాణాలు కూడా పూర్తి అయ్యింది తెలియజేసినారు. మీరు గాని మీ యొక్క నాయకులు ఏ రోజైనా విరాళాలని సమకూర్చి అభివృద్ధికి కృషి చేసారా.ఈ విలేకరుల సమావేశంలో ధర్మకర్త మండలి సభ్యురాలు సుమతి, ఆలయ అధికారులు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్,ఈఈ నూకరత్నం, డిప్యూటీ ఈఓ వెంకటసుబ్బయ్య, ధనపాల్, ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, వేద పండితుల అర్ధగిరి, మారుతి శర్మ, ప్రభాకర్ శర్మ, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
దక్షిణ కైలాస క్షేత్ర ప్రతిష్ట కాపాడండి – తారక శ్రీనివాసులు
102
previous post