సంక్రాంతి పండుగ పర్వదినాల పరిష్కరించుకుని అవనిగడ్డ డివిజన్ పరిధిలోని ఎవరైనా కోడిపందాలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని అవనిగడ్డ డిఎస్పి మురళీధర్ హెచ్చరించారు. అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ అవనిగడ్డ డివిజన్ పరిధిలోని కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ గ్రామాలలో ఎటువంటి కోడిపందాలకు జూదాలకు అనుమతులు లేవని, పోలీసులు అనుమాతులు ఇచ్చినట్లు చెప్పి ఎవరైనా బరులు నిర్వహిస్తే వెంటనే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దొంగచాటుగా కోడిపందాలు, జుదాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధించిన పోలీస్ స్టేషన్లో అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు. తెలియజేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అవనిగడ్డ సర్కిల్ పరిధిలోని ఎవరైనా జుదాలు, కోడి పందాలు నిర్వహిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఆ మండలాల్లోని సబ్ ఇన్స్పెక్టర్ మీడియా సమావేశాలు నిర్వహించి తెలియజేశారు.
Read Also..