77
రాజమండ్రి విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పాలకొల్లు విచ్చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పోడూరు మండలం జిన్నూరు వంతెన వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గజమాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు త్రిబుల్ ఆర్ జిందాబాద్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు శాలువాతో రఘురామను సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ నరసాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పొత్తూరి రామరాజు, కొవ్వలి యతిరాజా నాయుడు, జనసేన ఇన్చార్జి బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.