ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉండి మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన కొనతం వెంకట కేశవ శివసుబ్రహ్మణ్యం అదే గ్రామానికి చెందిన యర్రా కోమలిని కొడవలితో పీక కోశాడు. శివ సుబ్రహ్మణ్యం 2021లో ఇదే కోమలిని వేధిస్తుండగా… ఉండి పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేస్ నమోదైంది. కోమలి పదో తరగతి చదువుతున్న సమయంలో శివ సుబ్రహ్మణ్యం వద్దకు ట్యూషన్ కు వెళ్లేదని, అప్పుడు వేధించడంతో కేసు పెట్టినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పుడు అమ్మాయి భీమవరంలో ఇంజినీరింగ్ చదువుతోందని, సెలవులకు ఇంటికి వచ్చేసరికి తనను ప్రేమించాలని వేధిస్తూ గొంతు కోశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిని భీమవరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. కోమలిని పీక కోయడంతో ఆగ్రహించిన గ్రామస్తులు శివ సుబ్రహ్మణ్యానికి దేహశుద్ధి చేయడంతో… పోలీసులు అతడిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శివ సుబ్రహ్మణ్యం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఏలూరు జిల్లాలో దారుణం…
82
previous post