65
బిగ్ బాస్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ అనేది చారిత్రకమైన హేయంతో కూడిన అంశమన్నారు. తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు హైదరాబాద్‌లో ర్యాలీ చేపట్టారు. అందులో పాల్గొన్న నారాయణ బిగ్ బాస్ అనేది నేరపూరిత సామాజానికి దోహదపడుతుందన్నారు. అది దేశానికి, యువతకు చీడపురుగన్నారు. ఈ సమాజాన్ని బిగ్ బాస్ షో ధ్వంసం చేస్తుందన్నారు. బిగ్ బాస్‌ను అడ్డుకోవాల్సిన కర్తవ్యం కళకారులు అందరిపైనా ఉందని చెప్పారు. అశ్లీలమైన ప్రదర్శన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాకారులు అందరూ కలిసి వచ్చే బిగ్ బాస్ ప్రోగ్రామ్‌ని ధ్వంసం చేయాలని, దాడులు సైతం చేయాలని పిలుపునిచ్చారు.