89
కాకినాడ జిల్లా పిఠాపురం రాష్ట్రంలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గం. నేరుగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే రానురాను ఇక్కడ పార్టీ బలహీనపడుతోందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇంచార్జిలు మారారు. ఇలాంటి నేపథ్యంలో స్థానికుడు, విద్యావేత్త, కడారి తమ్మయ్య నాయుడు పేరు తెరిపైకొచ్చింది. పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ లేదంటే తమ్మయ్య నాయుడుకి సీటు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఇంచార్జ్ ఉదయ శ్రీనివాస్ పనితీరు సరిగా లేకపోవడంతో తమ్మయ్య నాయుడుకు టికెట్ ఇస్తారన్న వాదన పెరుగుతోంది.