అక్రమాస్తుల ఆరోపణలతో అరెస్ట్ అయిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే రెండు రోజులు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మొదటి రోజు 7 గంటలు, రెండోరోజు 6 గంటలు శివబాలకృష్ణను ప్రశ్నించారు. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు, బినామిలు, స్థిర, చారస్థులపై సుదీర్ఘంగా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రత్యేక గదిలో శివబాలకృష్ణను విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నారు. శివబాలకృష్ణ పేరుతో 8 బ్యాంక్ అకౌంట్లు, భార్య రమాదేవి పేరుతో 4, కుటుంబ సభ్యులైన పద్మావతి పేరుతో 2, శివహరిప్రసాద్ పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లు గుర్తించారు. ఆయా అకౌంట్ల స్టేట్మెంట్లను సేకరించారు. అలాగే శివహరిప్రసాద్ పేరిట నాలుగు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని ఓపెన్ చేసేందుకు బ్యాంక్ అధికారుల అనుమతి తీసుకున్నారు. భార్య, కొడుకు, సోదరుడు, బంధువుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను సేకరించారు.
శివబాలకృష్ణపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం..
78
previous post