రాను రాను వ్యవసాయం సులభతరం అవుతుంది. దీంతో నేటి యువ రైతులు సైతం వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మొదలుపెట్టారు. ఇదే క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన శ్యాంసుందర్, రాజు పటేల్ అగ్రి గ్రీన్ ప్రారంభించారు. 8 ఏళ్ల నుంచి నాటు కోళ్లు పెంపకం, పశువులను పెంచుతూ లాభాలు సాధిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల అత్యధిక అత్యాధునిక డ్రోన్ యంత్రాన్ని తైవాన్ నుంచి తెప్పించి పంటలపై ఎరువులు, విత్తనాల చల్లేందుకు ఉపయోగిస్తున్నారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ డ్రోన్ యంత్రం విధానాన్ని పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ సాగు కోసం కూలీలు కొరత నేపథ్యంలో ఇలాంటి డ్రోన్ విధానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పంటపై ఎరువులతో పాటు విత్తనాలు చల్లేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ సందర్భంగా యువ రైతులు మాట్లాడుతూ.. అధునిక వ్యవసాయంలో భాగంగా ఐదు నిమిషాల్లో ఒక ఎకరంలో ఎరువులను స్ప్రే చేసే వీలుంటుందని అంటున్నారు. ఈ విధానం ప్రస్తుతం రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వారు పేర్కొన్నారు.
డ్రోన్ యంత్రంతో ఎరువుల స్ప్రే..
89
previous post