జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా కృషిచేసిన తల్లి, చెల్లిని తరిమేసిన దుర్మార్గుడని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహాల్ మండలం ఓబులాపురం గ్రామంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టిడిపిలోకి 150 కుటుంబాలు చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. ముందుగా పార్టీలోకి చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను టీడీపీ పార్టీ కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను పూలమాలలు గజమాలతో ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి ఘోర పరాజయం తప్పదన్నారు. జనం ధనం కి మధ్య జరిగే ఎన్నికల్లో జనమే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని వైసీపీ నీరుగార్చిందంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు. ఒక్క ఛాన్స్ తో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ పాలనతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిస్తున్న జగన్ కు పతనం తప్పదన్నారు. రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు రాసివ్వడంతో యదేచ్ఛగా సహజ వనరుల దోపిడీ జరుగుతుందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గాలి వీస్తుందన్నారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమితో 165 స్థానాలు విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయదుర్గం నియోజకవర్గం ఇంచార్జ్ కరేగౌడ మంజునాథ్ గౌడ్ పాల్గొన్నారు.
తల్లి, చెల్లిని తరిమేసిన దుర్మార్గుడు జగన్..
76
previous post