102
హైదరాబాద్ నుండి మహారాష్ట్ర కు గంజాయి తరలిస్తున్న మూడు వాహనాలను నిర్మల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం మేరకు నిర్మల్ డి.ఎస్.పి మరియు పోలీసుల బృందం నిర్మల్ పట్టణ శివారు కొండాపూర్ ప్రాంతం వద్ద మాటు వేశారు. అటు వస్తున్నా వాహనాలను మూడింటిని ఆపి తనఖీ చేయగా వాహనాలలో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక అరలలో గంజాయిని కనుగొన్నారని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 6 లక్షల రూపాయలు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, 10 సెల్ ఫోన్లను, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.