ఏపీలో ఉద్యోగులు మరోసారి ఆందోళన బాటపట్టారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని ఈ నెల 14 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే ఈ నెల 27న ‘ఛలో విజయవాడ’కు సిద్ధమని ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు. తాము సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఉద్యోగులు దాచుకున్న వివిధ రకాల కాంపొనెంట్స్ డబ్బుతో పాటు పీఆర్సీ, డీఏ బకాయిలు, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటి ప్రధాన ఆర్థిక సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని నెలలు గడుస్తున్నా రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా సమస్యలు పరిష్కరించకపోవటంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. ఉద్యోగుల ఆందోళనతో దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం వారితో చర్చలు జరిపేందుకు సిద్ధమౌతుంది. చర్చలు సఫలం కాకుంటే ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం ప్రకటించడంతో ఈ చర్చల్లో ఏం జరుగుతుందనేది ప్రాధాన్యం సంతరించుకుంది.
5 ఏళ్ళు నువ్వేం చేసావ్ ..? తిరగబడ్డ ఏపీ ఉద్యోగులు
95
previous post