SriSailam:
శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్లంజ్‌పూల్ ముప్పు నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందన్నది ప్రశ్నార్థకమైంది. జలాశయం వద్ద సుమారు 130 అడుగుల లోతు గొయ్యి (ప్లంజ్‌పూల్) ఏర్పడింది. దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూడ్చకపోతే పెనుముప్పు తలెత్తే ప్రమాదముందని నిపుణులు కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నారు. సమస్య తీవ్రతపై ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లుగా స్పందించ లేదు. సంక్లిష్టమైన ఈ సమస్యపై అధ్యయనం చేసేందుకే సుమారు రూ.15 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. దేశంలోని పలు పరిశోధన సంస్థలకు చెందిన నిపుణులతో అధ్యయనం చేయించాలి. అన్ని బృందాల నిపుణులు ఇచ్చిన నివేదికల్లో ఉత్తమమైనది ఎంపిక చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం కనీసం ఒక్క నిపుణుల బృందంతోనూ అధ్యయనాన్ని ప్రారంభించలేదు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.