107
నెల్లూరు నగరం టిడ్కో గృహాల ప్రారంభోత్సవంలో లబ్ధిదారుల ఆందోళనకు దిగారు. అల్లిపురం వద్ద టిడ్కో గృహాలను అట్టహాసంగా మంత్రులు ప్రారంభించారు. దీంతో ఇంటి పట్టాలు అప్పగిస్తారని ఆశతో భారీగా లబ్ధిదారులు తరలివచ్చారు. కాని కొద్దిమందికి మాత్రమే ఇంటి తాళాలు ఇచ్చి నేతలు వెళ్లిపోయారు. దీంతో అక్కడకు వెళ్లిన లబ్ధిదారులు తమకు ఇంటి తాళాలు ఇవ్వని నేతలు ఎందుకు పిలిపించారని ప్రశ్నించారు. ఇంకెప్పుడు ఇళ్లు ఇస్తారంటూ మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. అప్పటికే పట్టా పొందిన వ్యక్తి తనకు ఇంటిని అప్పగించకపోవడంతో ఆవేదనతో కార్యక్రమం వద్ద ఇంటి పట్టాను చించివేసాడు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.