రైతులు ఆందోళన (Farmers Darna):
ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన (Farmers Darna) కొనసాగుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని రైతులు అంటున్నారు. ఇవాళ రైతులతో కేంద్ర ప్రభుత్వం మూడో విడత చర్చలు జరపనుంది. రైతుల డిమాండ్లు ప్రధానంగా కనీస మద్దతు ధర హామీకి చట్టబద్ధత, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీ, రైతులు-రైతుకూలీలకు పెన్షన్లు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంపు, 2020-21లో ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసుల్ని కొట్టివేయడం, లఖింపూరిఖేరి బాధ్యులను శిక్షించడం, రైతు ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, పరిహారం, నకిలీ విత్తనాలు, మందుల తయారీదారులపై కఠిన చర్యలు మిర్చి, పసుపు, సుగంధ పంటలకు జాతీయ కమిషన్ ఏర్పాటు, ఆదివాసీల హక్కులు, అటవీ భూముల రక్షణ రైతుల డిమాండ్‌లుగా ఉన్నాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇవే అంశాలే అజెండాగా కేంద్రంతో రైతులు చర్చలు జరపనున్నారు. మరోవైపు సరిగ్గా ఎన్నికలకు ముందు రైతులు ఆందోళనకు దిగడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వమే నెరవేర్చాలన్నది అన్నదాతల వాదన. సంయుక్త కిసాన్ మోర్చా -రాజకీయేతర విభాగం ఆధ్వర్యంలో తాజా ఆందోళనలు జరుగుతున్నాయి. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.