ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ పొత్తు విషయంలో జరిగిన చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పొత్తులపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే చర్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 అసెంబ్లీ స్థానాలపై ఏపీ బీజేపీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో చర్చలు జరిపిన అమిత్ షా, బీజేపీకి పట్టున్న అసెంబ్లీ స్థానాల వివరాల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర బీజేపీ అధిష్టానాన్ని ఆదేశించారు. ఈ మేరకు సీట్లపై కసరత్తు చేసి రాష్ట్ర బీజేపీ అధినాయత్వం 20 అసెంబ్లీ స్థానాలతో ఓ జాబితాను రూపొందించింది. ఉమ్మడి కర్నూలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో పోటీకి బీజేపీ ఆసక్తి చూపుతోంది. తూర్పు గోదావరిలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 4, నెల్లూరులో 2, కడపలో 1, చిత్తూరులో 1, పశ్చిమ గోదావరిలో 3 సీట్లను ఆ పార్టీ కొరుతోంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురంలో ఒక్కొక్కటి చొప్పున పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఈ మేరకు నియోజకవర్గాల పేర్లను సూచిస్తూ.. హైకమాండ్‌కు ఏపీ బీజేపీ రిపోర్టును పంపింది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి