ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. తణుకు నుంచే అనేకమంది ఉద్దండలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు దేశవ్యాప్తంగా పేరుగాంచారు. తణుకు లో 1947లో ఆంధ్రా షుగర్స్- స్వతంత్ర భారతదేశంలో స్థాపించబడిన మొదటి పరిశ్రమ, భారతదేశంలో మొట్టమొదటి ఆస్పిరిన్ ఫ్యాక్టరీ మరియు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు సరఫరా చేసే రాకెట్ ఇంధన యూనిట్ ఇక్కడ ఉండటం తణుకు ప్రత్యేకత.. ఇంత ప్రఖ్యాతగాంచిన తణుకు నియోజకవర్గంలో రాజకీయాలు అదే స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం తణుకు నియోజకవర్గంలో ఎన్నికలు వార్ కొనసాగుతుంది. నియోజకవర్గంలో గెలిచేది నువ్వా నేనా అంటూ అటు వైసిపి ఇటు టిడిపి, గెలుపు గుర్రాల కోసం పరుగులు పెడుతున్నాయి. తణుకు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఆరుసార్లు విజయాన్ని సాధిస్తే కాంగ్రెస్ రెండు సార్లు, వైసిపి ఒక్కొసారి అదికూడా స్పల్పమెజార్టీతో గెలిచింది.
ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న కారుమూరి నాగేశ్వరరావు 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత వైస్సార్సీపీ లో చేరి 2014లో టిడిపి అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ బరిలో ఉన్నారు. ఇప్పటికే కారుమూరి నాగేశ్వరావును వైసీపీ బాస్ జగన్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే జనసేన, టిడిపి కూటమి నేపథ్యంలో ఇప్పటివరకు తణుకు నియోజకవర్గ నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్న ది ఇంకా స్పష్టత రాలేదు. ఒక పక్క టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధా కృష్ణ టిక్కెట్ కోసం తన ప్రయత్నాలు జరుపుతుంటే మరో పక్క జనసేన నేత విడివాడ రామచంద్రరావు జనసేన, టీడీపీ కూటమిలో టిక్కెట్ కోసం ఆశిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటు టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ కూడా వైసిపి పాలనను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు ..ప్రభుత్వ పాలనపై నిత్యం తణుకు ప్రాంతం నుంచి టిడిపి తరపున మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ట ఆద్వర్యంలో ఆందోళణలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీని ద్వారా సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయం అర్ధమయ్యేలా చెప్పడంతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో అరిమిల్లిది అందవేసిన చేయిగా మారింది. తణుకులో టిడిపి క్యాడర్ కు ఉన్న కాన్ఫిడెంస్ చూసిని అధినేత చంద్రబాబు అక్కడి నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పంటనష్టమయిన రైతులకు పరిహారం ఇవ్వండంటూ చంద్రబాబు సైతం తణుకులో పాదయాత్ర చేపట్టారు. రైతులు నష్టపోయి బాధలో ఉంటే అక్కడి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కారుమూరి మాత్రం రైతులను ఎర్రిపప్పలంటూ సంబోదించడం అప్పట్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈఘటనతో టిడిపి ప్రజాబలం మరింత పెరిగింది..
రాష్ట్రవ్యాప్తంగా వైసిపి చేస్తున్న అరాచకాలపై తెలుగుదేశంపార్టీ గొంతెత్తడం ఒక ఎత్తయితే మంత్రికారుమూరి నియోజవర్గమైన తణుకులో తెలుగు తమ్ముళ్ళు ఎన్నో కేసులు, ఒత్తిళ్ళు ఎదుర్కొని గళమెత్తడం మరోఎత్తు అయితే ప్రస్తుతం టీడీపీ, జనసేన కూటమి నేపథ్యంలో తణుకు నియోజకవర్గ టికెట్ టిడిపి తరఫునమాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణకు ఇస్తారా లేక జనసేన నేత విడివాడ రామచంద్రరావు.. కు ఇస్తారో అన్న సందిగ్ధత ఇక్కడ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.. 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన ఆరమిల్లి రాధాకృష్ణ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి ఎన్నికల్లో టిడిపి తరఫున రాధాకృష్ణకు టికెట్ ఇస్తే గెలుపు తధ్యమని నియోజకవర్గ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..అసలు తణుకు నియోజకవర్గంలో ఏపార్టీ జెండా ఎగురుతుందో తెలియయ్యాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాలి.
వైసీపీ కి గట్టి ఎదురుదెబ్బ తగలనుందా?
94
previous post