115
తమిళనాడు హోసూరులో దారుణం చోటుచేసుకుంది. హోసూర్ సమీప అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు దాడి చేసిన ఘటనలో ఓ ఆవుతో పాటు ఇద్దరు మహిళలు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, అటవీశాఖ అధికార్లను అప్రమత్తం చేశారు. మృతి చెందిన వారు అన్నియాలం గ్రామానికి చెందిన వసంతమ్మ, అశ్వత్తమ్మగా పోలీసులు గుర్తించారు. మహిళల మృతితో అన్నియాలం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.