అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహిస్తున్న కాంగ్రెస్ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖడ్గరే, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల హాజరవుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి చీఫ్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనంతపురం జిల్లాలో చేపట్టేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ సభలో ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. జిల్లాకు సాగునీరు తాగునీరు అందించేందుకు శాయశక్తుల కృషి చేశామన్నారు. హంద్రీనీవా పథకం, కస్తూరిబా పాఠశాలలు నిర్మించామన్నారు. ముఖ్యంగా రాప్తాడు ముఖ్యమంత్రి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై జరిగిన దాడి అమానుషమని పేర్కొన్నారు. పాత్రికేయులపై దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బహిరంగ సభను విజయవంతం చేయండి…
101
previous post