పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas):
తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాపాలన కావాలని-రావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టంగట్టారని అన్నారు. 70 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్నామన్నారు, ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేసి ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.