రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు గెలవడానికే పోటీ చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగానీ ఏదో పోటీ చేయాలని ఎన్నికల బరిలో నిలబడటం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎజెండా లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా బీజేపీకి అత్యధికంగా ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. సోనియాకు ఎలా సేవ చేయాలి సోనియాగాంధీ కుటుంబానికి సూట్ కేసులు ఎలా పంపాలనే ఆలోచన తప్ప కాంగ్రెస్‌కు మరొకటి లేదన్నారు. రైతు రుణమాఫీ ఎలా చేస్తారో, రైతుబంధు, నిరుద్యోగ భృతి ఏ విధంగా చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ఎవరితోనో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో విజయ్ సంకల్ప యాత్ర కొనసాగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.