Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Main News బాలికల గురుకుల విద్యాలయంలో ఘనంగా యాన్యువల్ డే వేడుకలు..

బాలికల గురుకుల విద్యాలయంలో ఘనంగా యాన్యువల్ డే వేడుకలు..

by Rama
Annual Day Celebrations

బాలికల గురుకుల విద్యాలయం (Girls Gurukula Vidyalaya):

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల బాలికల గురుకుల విద్యాలయంలో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ పాల్గొన్నారు. యాన్యువల్ డే సందర్భంగా విద్యార్థులు అంతా పండగ వాతావరణం లో సందడి చేస్తూ విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానందుకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఎమ్మెల్యే పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులపై చదువుల ఒత్తిడి ఉండదని.. అనేక రకాల సాంస్కృతిక, వైజ్ఞానిక వంటి కార్యక్రమాలతో విద్యార్థులపై పడుతున్న ఒత్తిడిని తగ్గించి మానసికంగా ఉత్తేజపరిచి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామన్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఎమ్మెల్యే రాగమయి దయానంద మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో యాన్యువల్ డే అంటే మీలాగే ఎంజాయ్ చేసే దానిని అంటూ తన స్కూల్ రోజులను గుర్తు చేసుకున్నారు. స్కూల్ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఇక్కడ విద్యార్థులు కూడా అంతే స్థాయిలో యాక్టివ్ గా ఉన్నారని ప్రశంసించారు. పాఠశాలకు కావలసిన ప్లే గ్రౌండ్, వాటర్ సమస్య ను అప్పటికప్పుడే అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. చదువులు పట్ల ఆడవారిపై ఉన్న అపోహలు తొలగిపోయేలా ప్రతి ఒక్కరూ మంచిగా చదవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల ఆర్ సి ఓ, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. Read Also..

  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.
    హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ చారిత్రక కట్టడం 110 ఏళ్ల వారసత్వాన్ని పూర్తిచేసుకుంది. గోతిక్ శైలిలో…
  • కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
    కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులు పూర్తి కావడంతో చివరి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రారంభమైన పనులు పూర్తికాని స్థితిలో ఉండగా, కలెక్టర్ చిత్రా మిశ్రా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023009
Total views : 140736

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.