మేడారం జాతర (Medaram Jathara):
మేడారంలో వనదేవతల మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే జాతర లో సుమారు కోటిన్నర మంది భక్తులు సమ్మక్క- సారలమ్మ ల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు రోజులపాటు కిక్కిరిసిపోయే మేడారం జాతరలో పోలీసు వ్యవస్థే చాలా కీలకంగా వ్యవహారిస్తుంది.
సమ్మక్క- సారలమ్మ తల్లులను గద్దెలకు చేర్చడం నుంచి ప్రముఖులకు బందోబస్తు ఇవ్వడం, మేడారం తరలి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయడం, జాతరలో రష్ ను కంట్రోల్ చేయడం, ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడటం, దొంగతనాల నియంత్రణ ఇలా ప్రతి ఒక్క పనీ పోలీసుల పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మేడారం మహాజాతరలో పోలీసు బలగాలే కీలకంగా పని చేస్తాయి. మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో పోలీస్ ఫోర్స్ నేటి నుంచి రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టమని స్పష్టం చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మేడారం అంటేనే పోలీసులకు సవాల్ గా మారే జాతర గా చెప్తుంటారు. జాతరలో ఏం కొంచెం నిర్లక్ష్యం వహించినా.. తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిచోటా పోలీస్ నిఘా ఉండేలా ఈసారి పెద్ద మొత్తంలో పోలీసులు మోహరిస్తున్నారు. జాతర పూర్తయ్యే వరకు 14 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐజీ డా.తరుణ్ జోషి మేడారం మహాజాతర బందోబస్తు, నిఘాపై దృష్టి పెట్టారు. గతంలో మేడారం ట్రాఫిక్ ఇంచార్జి గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన జాతరపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జాతర మొత్తం మీద ఐజీ, డీఐజీలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 డీఎస్పీలు, 400 సీఐలు, వెయ్యి మంది ఎస్సైలు, దాదాపు 12 వేల మంది కానిస్టేబుళ్లకు జాతర విధులు కేటాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ములుగు జిల్లా ఎస్పీ తెలిపారు.
నేటి నుంచి 24వ తేదీ వరకు మేడారం మహా జాతర వైభవంగా జరుగుతుంది. ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతా భారీ ఎత్తున తరలివచ్చే భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం కత్తిమీద సాము లాంటి పని… జాతర సమయంలో చిన్నాచితకా దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా పరమైన చర్యలతో పాటు జాతర క్రౌడ్ కంట్రోల్ కు పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతర పరిసరాల్లో మొత్తంగా 500 కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు,కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మేడారం జాతరను పర్యవేక్షణ చేస్తున్నాం అని ములుగు ఎస్పీ శబరీష్ చెబుతున్నారు.
సమ్మక్క-సారలమ్మ లను దర్శించుకోవడానికి ఈసారి ప్రముఖుల ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 23 న జాతరకు వస్తున్నారు.. ఈ నేపథ్యంలో అధికారులు ఫోకస్ పెట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క మేడారం జాతర సక్సెస్ పై దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని అందరూ మంత్రులు మేడారం వచ్చే అవకాశం ఉంది. వీఐపీల తో పాటు సాధారణ భక్తుల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.