మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు పూర్తయింది. మొత్తం 540 హుండీలను వారం రోజుల పాటు లెక్కించారు. హుండీల ద్వారా రూ.13కోట్ల25 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2022 మేడారం జాతర కంటే ఈ ఏడాది జాతరకు రూ.1.79 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎనిమిది రోజుల పాటు మేడారం హుండీలను లెక్కించారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర ఘనంగా జరిగింది. జాతర అనంతరం హుండీలను టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. నోట్లు, కాయిన్స్ కలిపి మొత్తం 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయలు వచ్చాయి. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండి వచ్చింది. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు.
sammakka sarakka jathara
పోలీసులు ఔదార్యం (police generous):
హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి జాతరకు వచ్చిన భక్తుడు రోహిత్ లాల్ చికలగుట్ట వెంట సుమారు 4 కిలోమీటర్ల దూరంలో సరదాగా వెళ్లి జంపన్న వాగులో స్నానం చేస్తూ నీటిలో మునిగి మృతి చెందారు. బందువులు ఇచ్చిన సంచారంతో స్పందించిన ఇంటలిజెన్స్ సీఐ సట్ల కిరణ్ కుమార్, సీసీఎస్ సీఐ అనుగుల శ్రీనివాస్, SI శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది రమేష్, మధు, సాంబయ్య, శంకర్ లు కాలినడకన భక్తుడు మృతి చెందిన చోటికి వెళ్ళారు. సుమారు 3 గంటలపాటు శ్రమించి నీటిలో మృత దేహం గుర్తించారు. మృతదేహం బయటికి తీసుకువచ్చారు. అడవి బాటలో మృతదేహం వాహనాల్లో తీసుకు వచ్చే అవకాశం లేకపోవడంతో మృత దేహాన్ని కర్రలకు కట్టుకుని బూజన మోసుకుంటూ సుమారు 4 కిలోమీటర్లు నడిచి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. రాను పోను 8 కిలోమీటర్ల నడవడంతోపాటు మృత దేహాన్ని 4 కిలోమీటర్లు మోసిన పోలీసులను భక్తులు అభినందిస్తున్నారు.
ఇది చదవండి: బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహాజాతర నాలుగు రోజులుగా భక్త జనంతో పులకించింది. నాలుగు రోజులుగా కోటిన్నర మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు మహా జాతర ముగియడంతో జనం నుంచి వనంలోకి వెళ్లిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు. శనివారం సాయంత్రం గిరిజన పూజారులు ప్రత్యేక పూజల మధ్య వనప్రవేశం చేయించారు. ముందుగా గోవింద రాజు, పగిడిద్ద రాజులను స్వస్థలాలకు తీసుకెళ్లారు. తర్వాత సమ్మక్కను చిలకల గుట్టలో ఉన్న వనంలోకి, సారలమ్మను కన్నేపల్లికి తీసుకెళ్లారు. ఉద్విగ్నంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరి రోజు కూడా భక్తులు పోటెత్తారు. వనదేవతలు అడవికి చేరే సమయంలో వాన జల్లులు కురవడంతో భక్తుల ముఖంలో చిరునవ్వు వెల్లు విరిసింది.
మేడారం జాతర (Medaram Jathara):
మేడారంలో వనదేవతల మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే జాతర లో సుమారు కోటిన్నర మంది భక్తులు సమ్మక్క- సారలమ్మ ల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు రోజులపాటు కిక్కిరిసిపోయే మేడారం జాతరలో పోలీసు వ్యవస్థే చాలా కీలకంగా వ్యవహారిస్తుంది.
సమ్మక్క- సారలమ్మ తల్లులను గద్దెలకు చేర్చడం నుంచి ప్రముఖులకు బందోబస్తు ఇవ్వడం, మేడారం తరలి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయడం, జాతరలో రష్ ను కంట్రోల్ చేయడం, ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడటం, దొంగతనాల నియంత్రణ ఇలా ప్రతి ఒక్క పనీ పోలీసుల పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మేడారం మహాజాతరలో పోలీసు బలగాలే కీలకంగా పని చేస్తాయి. మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో పోలీస్ ఫోర్స్ నేటి నుంచి రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టమని స్పష్టం చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మేడారం అంటేనే పోలీసులకు సవాల్ గా మారే జాతర గా చెప్తుంటారు. జాతరలో ఏం కొంచెం నిర్లక్ష్యం వహించినా.. తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిచోటా పోలీస్ నిఘా ఉండేలా ఈసారి పెద్ద మొత్తంలో పోలీసులు మోహరిస్తున్నారు. జాతర పూర్తయ్యే వరకు 14 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐజీ డా.తరుణ్ జోషి మేడారం మహాజాతర బందోబస్తు, నిఘాపై దృష్టి పెట్టారు. గతంలో మేడారం ట్రాఫిక్ ఇంచార్జి గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన జాతరపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జాతర మొత్తం మీద ఐజీ, డీఐజీలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 డీఎస్పీలు, 400 సీఐలు, వెయ్యి మంది ఎస్సైలు, దాదాపు 12 వేల మంది కానిస్టేబుళ్లకు జాతర విధులు కేటాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ములుగు జిల్లా ఎస్పీ తెలిపారు.
నేటి నుంచి 24వ తేదీ వరకు మేడారం మహా జాతర వైభవంగా జరుగుతుంది. ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతా భారీ ఎత్తున తరలివచ్చే భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం కత్తిమీద సాము లాంటి పని… జాతర సమయంలో చిన్నాచితకా దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా పరమైన చర్యలతో పాటు జాతర క్రౌడ్ కంట్రోల్ కు పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతర పరిసరాల్లో మొత్తంగా 500 కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు,కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మేడారం జాతరను పర్యవేక్షణ చేస్తున్నాం అని ములుగు ఎస్పీ శబరీష్ చెబుతున్నారు.
సమ్మక్క-సారలమ్మ లను దర్శించుకోవడానికి ఈసారి ప్రముఖుల ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 23 న జాతరకు వస్తున్నారు.. ఈ నేపథ్యంలో అధికారులు ఫోకస్ పెట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క మేడారం జాతర సక్సెస్ పై దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని అందరూ మంత్రులు మేడారం వచ్చే అవకాశం ఉంది. వీఐపీల తో పాటు సాధారణ భక్తుల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేశంలో అత్యధిక భక్తులు సందర్శించే జాతర మేడారం. అయితే వచ్చే నెలలో జరగబోయే మేడారం జాతర నిర్వహణకు, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక శ్రధ్ద చూపుతోంది. వచ్చే నెలలో జరగబోయే మేడారం మహా జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖకు సూచించింది. మేడారం సమ్మక్క సారక్క జాతరపై హైదరాబాద్లోని ఎంసీహెచ్ ఆర్డీలో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేసిందన్నారు. ఈ జాతరలో గిరిజన, ఆదివాసీ సంప్రదాయ నృత్యలతో పాటు ఇతర రాష్ట్రాల కళాకారుల బృందాలతో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతరలో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ దఫా జాతర ప్రాంతాన్ని 10 జోన్లుగా వర్గీకరించాలన్నారు. భక్తులు.. వన దేవతలను ప్రశాంతంగా దర్శించుకుని తిరిగి అంతే ప్రశాంతంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also..





Total views : 149516